Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆస్ట్రీయా కేంద్రంగా పని చేస్తున్న కార్గో- పార్ట్నర్ హైదరాబాద్లో తన నూతన కార్యాలయాన్ని తెరిచినట్టు ప్రకటించింది. ఈ సంస్థ వాయు, సముద్ర, రోడ్డు రవాణలతో పాటు గిడ్డంగుల సర్వీసులను అందిస్తుంది. ఇది భారత్లో తమకు 16వ ఆఫీసు అని ఆ కంపెనీ సౌత్ రీజినల్ మేనేజర్ సిఆర్ మల్లికార్జున తెలిపారు. ఇక్కడ రవాణ రంగంలో విస్తృ తావకాశాలు ఉన్నాయన్నారు. తమ సంస్థ కొత్త ఉద్యోగాలను కల్పించనుందన్నారు.