Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ (ఇండియా), ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ (ఐఐఐటి-హెచ్) భాగస్వామ్యంతో తన మొదటి ఆప్టమ్ స్టార్టప్ స్టూడియో ఇండియా కోమోర్ట్ను ఆవిష్కరించింది. ఈ కోహోర్టులో ఐదు హెల్త్‌కేర్ స్టార్టప్‌లు న్నాయని తెలిపింది. ఇందులో మెడ్టెల్, గ్రాయిల్మేకర్ ఇన్నోవేషన్స్, డాఫోడిల్ హెల్త్, నెమోకేర్, బివెల్ హెల్త్ విభాగాలను ప్రారంభించినట్లు పేర్కొంది. 'ఆప్టమ్లో, భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు-సమాచారాన్ని అనుసంధానించడం ద్వారా ఆరోగ్య వ్యవస్థను ఆధునీకరించడానికి, క్రమబద్ధీకరించడానికి, సరళీకతం చేయడానికి సహాయపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని మేము అభివద్ధి చేస్తున్నాము'' అని ఆప్టమ్ వ్యూహాత్మక భాగస్వామ్యాల విభాగం వైస్ ప్రెసిడెంట్ పాల్ నీల్సన్ అన్నారు.