Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు ఎథర్ ఎనర్జీ తమ భాగస్వామ్యాన్ని ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో చేసుకోవడంతో పాటుగా పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఈవీ ఫైనాన్సింగ్ అవకాశాన్ని తమ వినియోగదారులకు అందిస్తుంది. ఇప్పుడు వినియోగదారులు అతి సులభంగా అప్‌గ్రేడ్ చేసుకోవడంతో పాటుగా మరింత తెలివైన, వేగవంతమైన ఎథర్ 450 ఎక్స్ స్కూటర్‌ను సంప్రదాయ పెట్రోల్ స్కూటర్లకయ్యే నెలవారీ ఖర్చుతో సొంతం చేసుకునే అవకాశం అందిస్తుంది. మరింత మంది వినియోగదారులకు ఈ పథకం, లాభదాయకమైన ఫైనాన్సింగ్ అవకాశంగా నిలువడంతో పాటుగా విద్యుత్ వాహనాలను మరింత వేగంగా స్వీకరించడం ద్వారా వినియోగదారులకు ఎథర్ స్కూటర్లను మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎథర్ 450ఎక్స్ కొనుగోలు వేళ వినియోగదారులకు ఈ పథకం సౌకర్యం అందిస్తుంది. ఆన్ రోడ్ ధరపై కేవలం 5 డౌన్ పేమెంట్‌తో ఈ వాహనం సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని 8.5% వార్షిక వడ్డీరేటుతో పొందవచ్చు. అయితే, మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహన విభాగంలో ఐడీఎఫ్సీ ఈ పథకాన్ని 48 నెలల కాల వ్యవధితో అందిస్తుంది. దీనివల్ల ఈఎంఐలు అత్యంత అందుబాటు ధరలో ఉంటాయి. ఆచరణాత్మకంగా అతి తక్కువ ధరలో ఉండటం వల్ల వినియోగదారులు ఇంటికి అత్యాధునిక, పనితీరు ఆధారిత స్కూటర్‌ను తీసుకురావచ్చు. దీనిలో స్మార్ట్ ఫీచర్లు అయినటువంటి రివర్శ్ అసిస్ట్, డాక్యుమెంట్స్టోరేజీ, నేవిగేషన్, థెఫ్ట్ మరియు టో నొటిఫికేషన్ వంటివి ఉన్నాయి. ఎథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఎస్ ఫోఖెలా మాట్లాడుతూ ‘‘దేశంలో ఈవీ దిశగా వినియోగదారులు మారేందుకు ప్రభుత్వ రాయితీలు మరియు ప్రోత్సాహకాలు అత్యంత కీలకమైన పాత్రను పోషించినప్పటికీ, ఈవీ ఫైనాన్సింగ్ ఇప్పుడు దేశంలో తరువాత దశ వృద్ధికి తోడ్పడనుంది. ఈ ఈవీ ఫైనాన్సింగ్ స్కీమ్‌ను నేడు ఐడీఎఫ్సీ బ్యాంక్‌తో కలిసి పరిచయం చేయడమనేది ఎన్నో రకాలుగా ఓ ప్రతిష్టాత్మకమైన ముందడుగానే చెప్పాల్సి ఉంటుంది. దీని వల్ల దేశంలో విద్యుత్ ద్విచక్ర వాహన స్వీకరణ వేగవంతమవుతుంది. ఈ స్కీమ్ మొట్టమొదటిసారిగా 48 నెలల కాలవ్యవథతో ఎథర్ విద్యుత్ స్కూటర్‌ను సొంతం చేసుకునే అవకాశం అందిస్తుంది. మొట్టమొదటిసారిగా వాహనం కొనుగోలు చేస్తున్న వినియోగదారులకు సహజసిద్ధంగా ఉండే ఆందోళనలు అయిన వారెంటీ, రీసేల్ బ్యాటరీ జీవితం, రీప్లేస్మెంట్ ఖర్చులు వంటివి సైతం తగ్గుతాయి. ఇప్పుడు వినియోగదారులు అత్యున్నతమైన ఎథర్ 450ఎక్స్‌ను ఈ స్కీమ్‌తో సొంతం చేసుకోవచ్చు. సంప్రదాయ 125సీసీ స్కూటర్‌కు ఖర్చు పెట్టే నెలవారీ పెట్రోల్‌తో ఈ వాహనాన్ని దేశవ్యాప్తంగా సొంతం చేసుకోవచ్చు. రాబోయే నెలల్లో మరింత వేగంగా డిమాండ్‌ను సృష్టించడానికి ఇది తీడ్పడనుంది. నూతన నగరాలు, పట్టణాలకు మా ఎక్స్పీరియన్స్ కేంద్రాలను విస్తరించేందుకు ఇది తోడ్పడనుంది’’ అని అన్నారు.
‘‘పరిశ్రమలో మొట్టమొదటిసారిగా ఎథర్, తమ స్కూటర్లకు 48 నెలల కాల వ్యవధిని పొందిన మొట్టమొదటి ఓఈఎంగా నిలిచించదని గమనించడం చాలా కీలకం. ఇది మా వాహనాల యొక్క బలమైన, విశ్వసనీయమైన పనితీరుపై మా ఆర్థిక భాగస్వాములకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఈవీలలో పలు అగ్ని ప్రమాదాలు జరగడం చేత వినియోగదారులు చక్కటి నాణ్యత కలిగిన విద్యుత్ వాహనాల కోసం చూస్తున్నారు. దీనికి మద్దతు అందిస్తూ, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు ముందుకురావడంతో పాటుగా ఈ అవగాహనతో సుదీర్ఘకాలం ఈఎంఐగా అందిస్తున్నారు. ఎథర్ 450 ఎక్స్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా విక్రయాలు జరుపుతుండటంతో పాటుగా వినియోగదారులు, ఫైనాన్షియర్ల నడుమ ఒకే తరహా నమ్మకాన్ని కలిగిస్తుంది’’ అని రవ్నీత్ అన్నారు. ఈవీ మార్కెట్‌ను మొట్టమొదటిసారిగా స్వీకరించిన బ్యాంక్ ఐడీఎఫ్పీ బ్యాంక్. ఎథర్ వినియోగదారులకు నమ్మకమైన బ్యాంకబల్ పార్టనర్ గా నిలుస్తుంది. నేడు, ఐడీఎఫ్సీ ఖాతాలు ఎథర్ ఎనర్జీ వినియోగదారులలో 16%గా ఉన్నాయి. ఐడీఎఫ్సీ ఋణాలను న్యూ టు క్రెడిట్ వినియోగదారులు (ఎలాంటి క్రెడిట్ చరిత్ర లేకుండా ఉన్నవారు)కు అందిస్తుంది. వీరు 20–25% మొత్తం కొనుగోలుదారుల సంఖ్యపరంగా ఉన్నారు. టియర్ 2 మరియు టియర్ 3 నగరాలలో ఇది అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది.
శ్రీ రిషికాంత్ మిశ్రా, బిజినెస్ హెడ్, వెహికల్ లోన్స్ మాట్లాడుతూ ‘‘విద్యుత్ ద్విచక్రవాహన ఫైనాన్సింగ్‌లో తొలి తరం సంస్ధలలో ఒకటిగా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఉంది. నిత్యం అభివృద్ధి చెందుతున్న మా ఆఫరింగ్స్ విభిన్నమైన వినియోగదారుల విభాగాలకు మరియు మా సమగ్రమైన డిజిటైజ్డ్ వినియోగదారుల ప్రయాణానికి సరిపోలడంతో పాటుగా ఎథర్ ఎనర్జీ యొక్క వినియోగదారుల ఫైనాన్సింగ్ అనుభవానికి అసాధారణ విలువను జోడిస్తుంది’’ అని అన్నారు. అసాధారణ వృద్ధిని 2022లో ఎథర్ ఎనర్జీ నమోదుచేసింది. ఇయర్ ఆన్ ఇయర్ 202% వృద్ధి (ఏప్రిల్–అక్టోబర్)ని ఆన్ రోడ్ యాక్టివ్ స్కూటర్స్ పరంగా నమోదుచేసింది. ఈ కంపెనీ అత్యధిక నెలవారీ విక్రయాలను అక్టోబర్ 2022లో 8,213 యూనిట్ల విక్రయాలతో నమోదు చేసింది. ఈ కంపెనీ డిమాండ్ పరంగా స్థిరమైన వృద్ధిని అంచనావేస్తోంది మరియు దేశంలో అనుకూలమైన ఈవీ పర్యావరణ వ్యవస్ధను నిర్మించడంలో భారీగా పెట్టుబడి పెడుతోంది. ఎథర్, దేశవ్యాప్తంగా 600కు పైగా స్టేషన్లు 55కు పైగా నగరాలలో ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరాంతానికి 1400కు పైగా ఎథర్ గ్రిడ్స్‌ను అమర్చడానికి లక్ష్యంగా చేసుకుంది. ఈ కంపెనీ, మార్చి 2023 నాటికి 100కు నగరాలలో 150కు పైగా ఔట్లెట్లకు విస్తరించనుంది.