Authorization
Mon May 05, 2025 06:44:40 pm
న్యూఢిల్లీ : ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృసంస్థ మెటా ఇండియాలోని ఓ విభాగానికి హెడ్‌గా వికాస్ పురోహిత్‌ను నియమించింది. మెటా ఇండియా గ్లోబల్ బిజినెస్ గ్రూపు డైరెక్టర్‌గా వికాస్‌ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆయన స్ట్రాటజీ డెలివరీ విభాగాలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మెటాలో చేరకముందు టాటా క్లిక్ సిఇఒగా వికాస్ సేవలందించారు. టాటా క్లిక్, అమెజాన్, రిలయన్స్ బ్రాండ్స్, ఆధిత్య బిర్లా గ్రూపు, టమ్మీ హిల్ ఫైగర్ వంటి సంస్థల్లో 20 ఏండ్లకు పైగా సీనియర్ బిజినెస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో కీలకంగా వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది.