Authorization
Tue May 06, 2025 04:21:36 pm
హైదరాబాద్: దేశంలో 60 శాతం మంది నిద్ర లేమీతో బాధపడు తున్నారని జిక్వాయిల్ ఇండియా సర్వేలో వెల్లడయ్యిందని పిఅండ్జి హెల్త్ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ సాహిల్ సేథి తెలిపారు. కేవలం 15 శాతం మంది మాత్రమే సగటు ఉత్తమ నిద్ర పోతున్నారన్నారు. ఉత్తమ నిద్ర కోసం జీవన శైలీ మారాల్సిన అవసరం ఉందన్నారు. నిద్ర లేమితో భాదపడే వారి కోసం పిఅండ్జి కొత్తగా విక్స్ జిక్వాయిల్ న్యాచురాను ఆవిష్కరిం చిందన్నారు. పడుకునే ముందు ఈ చ్యూయబుల్ గమ్మీస్ను తీసుకోవడం ద్వారా నిద్రకు సహాయపడుతుందన్నారు. 10 చ్యూయబుల్ గమ్మీస్ ధరను రూ.199గా నిర్ణయించామన్నారు.