Authorization
Tue May 06, 2025 08:36:12 am
హైదరాబాద్ : తెలంగాణా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియం డి2సి డెయిరీ బ్రాండ్ సిద్స్ ఫార్మ్ కొత్తగా ఎ2 దేశీ ఆవు నెయ్యిని విడుదల చేసినట్లు ప్రకటించింది. తమ వినియోగదారుల కోసం భారత గణతంత్య్ర దినోత్సవ వేళ దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. సిద్స్ ఫార్మ్ గత ఆగస్టులో ఎ2 దేశీ ఆవు పాలు విడుదల చేసింది. ఈ స్పూర్తితో ఎ2 దేశి ఆవు నెయ్యిని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. 350 గ్రాముల ధరను రూ.999గా నిర్ణయించినట్లు తెలిపింది.