Authorization
Wed May 07, 2025 04:39:58 pm
న్యూఢిల్లీ : దేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దె ఒప్పందాలు భారీగా పడి పోవడమే ఇందుకు నిదర్శనం. ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయి, బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్, పూణె, కోల్కత్తా లాంటి ఏడు నగరాల్లో ప్రస్తుత ఏడాది జనవరిలో లీజింగ్ 56 శాతం పతనమై 32 లక్షల చదరపు అడుగులకు పరిమితమయ్యిందని కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. ఇంతక్రితం 2022 డిసెంబర్లో ఇది 74 లక్షల చదరపు అడుగులుగా నమోదయ్యిందని పేర్కొంది. కొత్త ఏడాది జనవరిలో సాధారణంగానే ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలపై కొంత ప్రతికూలత ఉంటుందని జేఎల్ఎల్ పేర్కొంది.