Authorization
Wed May 07, 2025 03:37:43 am
- రిలయన్స్ జియో ఛైర్మన్ వెల్లడి
ముంబయి : ప్రస్తుత ఏడాది డిసెంబర్ ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 5జి సేవలను అందుబాటు లోకి తేనున్నామని రిలయన్స్ జియో ఛైర్మన్ ఆకాశ్ అంబాని తెలిపారు. ఇప్పటికే 277 నగరాల్లో 5జి సేవల ను అందిస్తున్నామన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి, డిపిఐఐటి సంయుక్తంగా మంగళవారం ఏర్పాటు చేసిన పోస్ట్ బడ్జెట్ వెబినార్లో ఆకాశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 5జి సేవల అందించడంలో ముందున్నామన్నారు. ఇప్పటికే 40,000 సైట్లను 5జికి అప్గ్రేడ్ చేశామన్నారు. 2022 అక్టోబర్లో జియో 5జి సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.