Authorization
Tue May 06, 2025 09:35:47 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు టెల్కో భారతీ ఎయిర్టెల్ మరో 125 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించి నట్టు ప్రకటించింది. దీంతో దేశంలో తమ ఈ సేవలు 265 నగరాలకు విస్తరించినట్లయ్యిందని వెల్లడించిం ది. నూతన 5జీ టెక్నలాజీతో హై-డెఫినిషన్ వీడియో స్ట్రీమింగ్ గేమింగ్, మల్టిపుల్ చాటింగ్, ఫోటోల ఇన్స్టంట్ అప్లోడ్ వంటి వాటికి సూపర్‌ఫాస్ట్ యాక్సెస్ అందిస్తుందని తెలిపింది. 5జీ ఇంటర్నెట్ నూతన శకానికి నాంది పలికిందని భారతీ ఎయిర్టెల్ సీటీఓ రణదీప్ సెఖోన్ పేర్కొన్నారు. మరిన్ని నగరాలకు తమ నూతన సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు.