Authorization
Wed May 07, 2025 08:51:01 pm
- ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్
ముంబయి : విదేశీ మారకపు మార్కెట్లో తలెత్తే అనివార్యమైన రూపాయి అస్థిరతను నిర్వహించడానికి సన్నద్దంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎటువంటి పరిమితులు లేకుండా దిగుమతి, ఎగుమతి కోసం రూపాయి కరెన్సీని ప్రోత్సహించడం ద్వారా అస్థిరతను ఎదుర్కోవచ్చన్నారు. గత జూలైలో ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతులను సులభతరం చేయడం లక్ష్యంగా అంతర్జాతీయ వాణిజ్యాన్ని రూపాయల్లో స్థిరీకరించడానికి ఆర్బిఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు.