Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్ చార్జ్‌తో 230 కిలోమీటర్లు
హైదరాబాద్ : ఎంజి మోటర్ ఇండియా ఆవిష్కరించిన సరికొత్త విద్యుత్ వాహనం (ఇవి) కోమెట్ను హైదరాబాద్ మార్కె ట్లోకి విడుదల చేసింది. గురు వారం దీన్ని బంజారాహిల్స్ షోరూంలో ఎంజి ఇండియా రీజినల్ సేల్స్ మేనేజర్ పవర్ కుమార్, రామ్ గ్రూప్ సిఇఒ అనురాగ్ సిన్హా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. కోమెట్ ఎక్స్ షోరూం ధరను రూ.7.98 లక్షలుగా నిర్ణయించామన్నారు. సింగిల్ చార్జ్‌పై దాదాపు 230 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని తెలిపారు. రూ.519 వ్యయంతో 1000 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. గురువారం నుంచి టెస్ట్ డ్రైవ్‌లు మే 15 నుంచి బుకింగ్స్, ఆ తర్వాత డెలివరీలు ఉంటాయని ఆ కంపెనీ ఇది వరకే తెలిపింది. 17.3 కెడబ్ల్యుహెచ్ లిథియం-ఇయాన్ బ్యాటరీ కలిగిన ఈ వాహనం ఏడు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుందన్నారు.