Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఓటీటీ అగ్రిగేషన్ వేదిక టాటా ప్లే బింగేలోకి ఆహా యాప్ చేరింది. మైహోమ్ గ్రూప్, అల్లు అరవింద్ సహ యాజ మాన్యంలోని ఆహా తమ వేదికలో చేరడంతో టాటా ప్లే బింగేలోని ఓటీటీ యాప్‌లు 24కు చేరినట్లయ్యిందని ఆ సంస్థ తెలిపింది. ఆహా ప్రస్తుతం 750 పైగా సినిమాలు, 40 పైగా ఒరిజినల్ షోలు సహా థియేటరికల్ రిలీజ్లు, టాక్ షోలు, రియాలిటీ షోలతో సహా పలు రకాల ఒరిజినల్ సీరిస్‌లు కలిగి ఉంది.