Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : పతనం అంచున వేళాడు తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును కాపాడటానికి ప్రయివేటురంగ కంపెనీ లు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన నేపథ్యంలో అమెరికా అధికారులు రం గంలోకి దిగారని రాయిటర్స్ వార్తా సంస్థ శుక్రవారం రిపోర్ట్ చేసింది. ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ , ట్రెజరీ డిపార్ట్మెంట్, ఫెడరల్ రిజర్వ్(అమెరికా కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థను ఫెడరల్ రిజర్వ్ సిస్టమ్ లేక ఫెడరల్ రిజర్వ్ లేక ద ఫెడ్ అని పిలుస్తారు) తదితర ప్రభుత్వ సంస్థలు ఈ మధ్యకాలంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును కాపాడటానికి ఫైనాన్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపు తున్నాయి. ఈ ప్రయత్నంలో బ్యాంకులు, ప్రయివేటు ఈక్విటీ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు ఎఫ్డీఐసీ సహాయంతో బ్రతికి బయటపడటం కంటే ఒక ప్రయివేటు రంగ ఒప్పందంతో మనగలిగితేనే మేలని ప్రభుత్వం భావిస్తోంది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు, సిగేచర్ బ్యాంకు మార్చినెలలో దివాళా తీసిన తరువాత శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు ఈ త్రైమాసికంలో 100బిలియన్ డాలర్ల డిపాజిట్లను కోల్పోయినట్టు ప్రకటించగానే బ్యాంకు షేరు విలువ 75శాతం పతనమైంది. ఇలా పతనం అంచున వేళాడుతున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాకును కాపాడ టానికి 11బ్యాంకుల సహకారంతో 30బిలియన్ డాలర్ల నిధులను అందజేసి నప్పటికీ ఈ బ్యాంకు పట్ల విశ్వాసం ఏమాత్రం పెరగలేదు.