Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు సాంకేతిక బ్రాండ్లలో ఒకటైన పోకో, వినియోగదారులకు పోకో స్మార్ట్ఫోన్ల సాంకేతిక విప్లవాన్ని సాటిలేని ధరలలో ఆస్వాదించేందుకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో అన్ని ఉత్తేజకరమైన ఆఫర్లను నేటి నుంచి అద్భుతమైన తన ఉత్పత్తుల శ్రేణికి అందుబాటులోకి తీసుకువచ్చింది.
పోకో X5 5జిG (అతిపెద్ద ఆఫర్)
పోకో X5 5G అనేది శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్® 695 మరియు ఎఫ్‌హెచ్‌డి+ సూపర్ అమోల్డ్ (AMOLED) డిస్ప్లేతో రూ.15,000 లోపు ధర కలిగిన ఏకైక స్మార్ట్‌ఫోన్. ఇది 6.67’’ పెద్ద డిస్ప్లే కలిగి ఉండడంతో, వినియోగదారునికి కంటెంట్ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఇది 48ఎంపీ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంది.
పోకో M5
మీడియాటెక్ హెలియో G99 ప్రాసెసర్ కలిగిన పోకో M5 భారీ 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్లో ప్రీమియం లెదర్-తరహా ఫిట్నెస్ను కలిగి ఉంటుంది. ఇది 240హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో లీనమయ్యే 6.58-అంగుళాల 90హెడ్జ్ ఎఫ్‌హెచ్‌డి + స్మార్ట్ డిస్ప్లేను కలిగి ఉంది మరియు 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ పరికరం ప్రారంభ ధర రూ.8,999.
పోకో సి51
రూ.6,999 ధరలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ సి-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో G36ను, 6.52’’ హెచ్డీ+ డిస్ప్లేను, 7జిబి టర్బో రామ్ (4జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ + 3జీబీ టర్బో ర్యామ్) కలిగి ఉంది. ఇది 8ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 5,000ఎంఎహెచ్ శక్తి కలిగిన బ్యాటరీ ఉంది.
పోకో సి55
పోకో సి55 అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది. దాని ప్రధాన పనితీరుతో రూపొందించబడిన, పోకో సి55 మీడియాటెక్ హెలియో చిప్‌సెట్‌పై పని చేస్తుంది. సి-సిరీస్‌లో మొదటిదైన పోకో సి55 50 ఎంపి డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది 6.71” హెచ్డీ+ ప్యానెల్, భారీ 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ మరియు లెదర్ తరహా ఆకృతి డిజైన్‌తో వస్తుంది. ఇది కేవలం రూ.7,999 ధరలో లభిస్తుంది.
పోకో సి50
పోకో సి50 అనేది ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మరియు ఎక్కువ సమయం ఫోన్‌ను వినియోగించుకునేందుకు 5000 ఎంఎహెచ్ బ్యాటరీతో, రూ.5,499 ధరలో అందుబాటులోకి వచ్చిన అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్. ఇది ఇమ్మర్సివ్ 6.52’’ హెచ్డి+ డిస్ప్లే, 8ఎంపి ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది మీడియాటెక్ హెలియో ఏ22 చిప్సెట్ శక్తిని కలిగి ఉంది.
పోకో X5 ప్రో 5జి
పనితీరును అత్యున్నతంగా అందించేలా తయారు చేసిన పోకో X5 ప్రో 5జి స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్ శక్తిని కలిగి ఉంది. ఇది డాల్బీ విజన్® మరియు డాల్బీ అట్మాస్® సపోర్ట్‌తో 6.67’’ ఎక్స్ఫినిటీ అమోల్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వస్తోంది. పోకో X5 ప్రో 5జి భారతదేశంలో 108 ఎంపి ప్రైమరీ కెమెరా సెన్సార్‌ను కలిగిన మొదటి పోకో స్మార్ట్‌ఫోన్ కూడా. దీని ప్రారంభ ధర రూ.20,999.