Authorization
Tue April 08, 2025 09:02:48 am
నవతెలంగాణ-హైదరాబాద్ : వినియోగదారు మరియు ఎంఎస్ఎంఈ ఫైనాన్స్‌పై దృష్టి సారించిన , ఎన్ బి ఎఫ్ సి పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు, ఈ రోజు మార్చి 31, 2023తో ముగిసిన త్రైమాసిక మరియు సంవత్సరానికి ఆడిట్ చేయబడిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
ముఖ్యాంశాలు – 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం (స్వతంత్రం):
ఆస్తులు:
• 151% ఇయర్ ఆన్ ఇయర్ మరియు 89% క్యు ఆన్ క్యు తో 6,371 కోట్ల రూపాయల అత్యధిక త్రైమాసిక చెల్లింపులు.
• నిర్వహణలో ఉన్న ఆస్తులు 16,143 కోట్ల రూపాయల వద్ద, 37% ఇయర్ ఆన్ ఇయర్ మరియు 16% క్యు ఆన్ క్యు
• వితరణ లో డైరెక్ట్ డిజిటల్ ప్రోగ్రామ్ సహకారం 2023 ఆర్ధిక సంవత్సర మూడవ త్రైమాసం లో 66%తో పోలిస్తే 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం లో 81%కి మరియు 2022 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం లో 24%కి పెరిగింది.
లాభదాయకత:
• 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం కి 103% ఇయర్ ఆన్ ఇయర్ మరియు 20% క్యు ఆన్ క్యు కి పెరిగి గరిష్టంగా 181 కోట్ల రూపాయలు గా ఉంది. 2023 ఆర్ధిక సంవత్సర కోసం, పన్నుల తరువాత లాభం 585 కోట్ల రూపాయలు గా ఉంది.
• 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం కోసం నికర వడ్డీ మార్జిన్ 11.3% వద్ద ఉంది, 87 బీపీఎస్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు 59 బీపీఎస్ క్యు ఆన్ క్యు మెరుగుదల. 2023 ఆర్ధిక సంవత్సర కోసం, నికర వడ్డీ మార్జిన్ 10.7% వద్ద ఉంది, ఇది 89 బీపీఎస్ సంవత్సరం మెరుగుదల సాధించింది.
• 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం నిర్వహణ ఖర్చులు ₹ 196 కోట్లుగా ఉన్నాయి, క్యు ఆన్ క్యు 4% తగ్గింది.
• 2023 ఆర్ధిక సంవత్సర నాల్గవ త్రైమాసం కి నిర్వహణ లాభం ₹ 212 కోట్లు, 84% ఇయర్ ఆన్ ఇయర్ మరియు 36% క్యు ఆన్ క్యు వున్నాయి.
డివిడెండ్: వాటాదారుల ఆమోదానికి లోబడి, 2023 ఆర్ధిక సంవత్సర కి ప్రతి షేరుకు ₹ 2 డివిడెండ్ (ముఖ విలువలో 100%) ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది.
మూలధన సమృద్ధి మరియు ద్రవ్యత:
• క్యాపిటల్ అడిక్వసీ రేషియో మార్చి 31, 2023 నాటికి 39%గా ఉంది.
• మార్చి 31, 2023 నాటికి లిక్విడిటీ బఫర్ ₹ 3,001 కోట్లుగా ఉంది.
రేటింగ్ అప్‌గ్రేడ్: క్రిసిల్ దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌ను ఏఏఏ కి అప్‌గ్రేడ్ చేసింది.
పూనావాలా ఫిన్‌కార్ప్ పనితీరుపై , మేనేజింగ్ డైరెక్టర్, CA అభయ్ భూతాడ మాట్లాడుతూ, “2023 ఆర్ధిక సంవత్సర వ్యాపార వృద్ధి, క్రెడిట్ నాణ్యత మరియు లాభదాయకతలో ఆదర్శప్రాయమైన పనితీరును కలిగి ఉన్న సంవత్సరం గా నిలిచింది . క్రిసిల్ మరియు కేర్ రెండూ ఏఏఏ కి మా క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ చేయడం, మా బలమైన ప్రాథమిక అంశాలు మరియు అమలు ప్రతిబింబిస్తాయి. ఉన్నతమైన లాభదాయకతతో పాటు అత్యుత్తమ తరగతిలో ఉండే ఆస్తి నాణ్యతతో నిజమైన ఫిన్‌టెక్ మోడల్‌ను నిర్మించడంలో మేము ముందున్నాము. ఆవిష్కరణలు చేయడం, భవిష్యత్ ట్రెండ్లను అర్థం చేసుకోవడం మరియు బలమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం వంటి మా సామర్ధ్యం మమ్మల్ని ఎక్కువ మంది స్వీకరించే రుణదాతగా మార్చింది. రుణాలు తీసుకునే సమర్థవంతమైన ఖర్చు, తక్కువ నిర్వహణ వ్యయం, నియంత్రిత క్రెడిట్ ధర మరియు బ్రాంచ్-లైట్ టెక్-లీడ్ మోడల్‌తో, మేము స్థిరమైన మరియు అసాధారణమైన పనితీరును అందించడానికి సిద్ధంగా ఉన్నాము" అని అన్నారు