Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోని అన్ని ప్రాంతాలకు బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలను విస్తరించేందుకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కొత్తగా స్మార్ట్ సాథీని ప్రారంభించినట్లు తెలిపింది. దీన్ని న్యూఢిల్లీలో ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూప్ స్టార్టప్ విభాగం హెడ్ స్మితా భగత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాంక్ ఉన్నతాధికారులు ముకేశ్ బన్సాల్, దినేష్ లూత్రా, అజరు శర్మ పాల్గొన్నారు. ఆర్థిక అక్షరాస్యతకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్మార్ట్ సాథీ దోహదం చేయనుందని వివేక్ జోషి పేర్కొన్నారు. ఇది వ్యాపార కరస్పాండెంట్లు సాంప్రదాయకంగా ఖాతాలు తెరవడం, లావాదేవీలను నిర్వహించడాన్ని సులభం చేయనుందని ఆ బ్యాంక్ తెలిపింది.