Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రద్దు చేసిన మొండి బాకీల వసూళ్లకు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించడానికి సిద్దం అవుతోన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.2 లక్షల కోట్లు వసూళ్లు చేయాలని పీఎస్బీలకు కేంద్ర ప్రభుత్వం సూచించిందని ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్ చేసింది. 2021-22 ముందు ఆరేండ్లలో పీఎస్‌బీలు దాదాపు రూ.8.16 లక్షల కోట్ల మొండి బాకీలను రద్దు చేశాయి. 2022-23 మొదటి తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.90,958 కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ఆర్బీఐ గణంకాలు పేర్కొంటున్నాయి. రద్దు చేసిన రుణాలపై దృష్టి సారించాలని పీఎస్బీ అధికారులకు సూచనలు వెళ్లాయని ఓ అధికారి పేర్కొన్నారు. వీటి వసూళ్లకు రుణదాతలు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారని వెల్లడించారు. ఇచ్చిన అప్పులు ఇక తిరిగి రావనుకుని భావించినప్పుడు బ్యాంక్‌లు ఆయా రుణ ఖాతాలను రద్దు చేస్తాయి. అయినా కొన్ని సార్లు ట్రిబ్యునళ్లు, కోర్టులు, ఇతర మార్గాల్లో రికవరీ ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి.