Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని మల్టీబ్రాండ్ మొబైల్స్ రిటైలర్ లాట్ మొబైల్స్ తమ స్టోర్లలో ఏసీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ప్రకటించింది. ఇప్పటికే ఈ సంస్థ స్మార్ట్ టీవీలు, ఫోన్లు, స్మార్ట్ వాచీలు, లాప్‌ట్యాప్‌లు, బ్రాండెడ్ యాక్సిసరీస్ను విక్రయిస్తోంది. ఏసీలలో పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ స్టోర్స్‌లో వొల్టాస్, లాయిడ్స్ తదితర పలు బ్రాండెడ్ ఏసీలను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఏసీల కొనుగోళ్లలో 15-20 శాతం వృద్థి ఉండొచ్చని ఆ రంగం మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏసీ కొనుగోలుపై అద్బుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు లాట్ మొబైల్స్ ఆధీకృత ప్రతినిధి యం అఖిల్ తెలిపారు. 45 శాతం వరకు తగ్గింపు, 20 శాతం వరకు క్యాష్ బ్యాక్ సహా ప్రతీ నెల ఈఎంఐ రూ.1,888 నుంచి ప్రారంభమువుతుందన్నారు. 90 నిమిషాల్లోనే ఉచిత హోం డెలివరీ సౌకర్యం కలదన్నారు.