Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: భారతదేశంలో 470 మిలియన్ ల జనాభాతో 'డిజిటల్ నేటివ్స్' యొక్క మొదటి తరం, జన్-జడ్ నేటి సంస్క్రతిని నిర్వచించే కొత్త ట్రెండ్స్ ను తెచ్చిన నవవైతాళీకులు. జనరేషన్ జడ్ సిద్ధాంతాలు, జీవన శైలి ఎంపికలు, దుస్తుల ప్రాధాన్యతలు భవిష్యత్తులో వినియోగించే నమూనాలుగా నిలుస్తాయి. ఈ నేపధ్యంలో, ఈ వినియోగదారు విభాగం కంటికి ఆకర్షణీయంగా కనిపించే, విలువైన జీవన శైలి ఎంపికలు కేవలం క్లిక్ తో లభిస్తున్నాయి, అమేజాన్ ఫ్యాషన్ నెక్ట్స్ జన్ స్టోర్ ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. జనరేషన్ జడ్ షాపర్స్ యొక్క విలక్షణమైన ఫ్యాషన్ అవసరాలకు సాధికారత కల్పించడానికి , వారి అవసరాలు తీర్చడానికి రూపొందించడింది. Amazon.in పై ఈ విలక్షణమైన స్టోర్ ఫ్రంట్ ఆరంభించబడటం ప్రస్తుత మార్కెట్ అంతరాన్ని భర్తీ చేసి మరియు ఫ్యాషన్ తో ప్రయోగాలు చేయాలని కోరుకుని, స్టైల్స్, సైజ్ , బ్రాండ్స్, ఫిట్టింగ్ వంటి విభిన్న అవసరాలు కలిగిన జనరేషన్ జడ్ యొక్క నిర్దిష్టమైన అవసరాలు తీర్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. అమేజాన్ ఫ్యాషన్ కు జన్ -జడ్ కస్టమర్స్ కోసం విలక్షణమైన, ఆధునికమైన, ఫ్యాషనబుల్ స్టైల్స్ ను కేటాయించే 200+ దేశీయ మరియు అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్స్ ఉన్నాయి. జనరేషన్ జడ్ కస్టమర్స్ కోసం సులభంగా నేవిగేట్ చేయడానికి మరియు షాపింగ్ ను ఉత్తేజభరితమైన అనుభవంగా చేసే అందాన్ని చూపించడానికి ఈ స్టోర్ రూపొందించబడింది. స్టోర్ ఫ్యాస్ట్ ఫ్యాషన్, సుస్థిరమైన ఫ్యాషన్, సరసమైన స్టైల్స్ మిశ్రమాన్ని అందిస్తోంది, అమేజాన్ ఫ్యాషన్ పై ఏకైక ఆన్ లైన్ గమ్యస్థానంలో సమగ్రమైన షాపింగ్ అనుభవాన్ని నిర్థారిస్తోంది.
జెన్ జడ్ యొక్క నిరంతరంగా మారుతుండే డిమాండ్స్ తీర్చడానికి, ఆకర్షణీయమైన ప్రింట్స్, మోనోక్రోమ్స్, నియాన్స్, కాటన్స్, లినెన్స్, కలర్-పాప్ ఫుట్ వేర్, బగుట్టి బ్యాగ్స్, లేయరింగ్, ఓవర్ సైజ్డ్ ఫిట్స్ మొదలైన వాటితో సహా ట్రెండింగ్ ఉత్పత్తులను ఎంపికతో పాటు ద నెక్ట్స్ జన్ స్టోర్ జాగ్రత్తగా రూపొందించబడింది. అదనంగా, నెక్ట్స్ జన్ స్టోర్ దుస్తుల కలక్షన్ ను పూరించడానికి యాక్ససరీస్, స్మార్ట్ వాచెస్, స్నీకర్స్, స్పోర్ట్స్ షూస్, హై బూట్స్ ను కూడా అందిస్తోంది. లెవీస్, సోల్డ్ స్టోర్, మార్స్, లాకోస్ట్, క్రాక్స్, టైమెక్స్, మైగ్లామ్, ఓన్లీ, వీరో మోడా, టామ్మి హైఫైజర్ , జాక్ అండ్ జోన్స్, అండ్, ఫాస్ట్ ట్రాక్, ఫాసిల్, ప్యూమా, ఆడిడాస్, లోరియల్ మరియు ఇంకా ఎన్నో బ్రాండ్స్ దీనిలో భాగంగా ఉన్నాయి.
సౌరభ్ శ్రీవాత్సవ, డైరక్టర్ మరియు ప్రధాన అధికారి, అమేజాన్ ఫ్యాషన్ ఇండియా, ప్రారంభోత్సవం సందర్భంగా ఇలా అన్నారు, "90 మధ్యలో మరియు 2000 ఆరంభంలో పుట్టిన, ఈ యువ మరియు భవిష్య యువత శక్తివంతమైన యువదళంగా ముందుకు దూసుకుపోతోంది. జన్-జడ్ ఫ్యాషన్ ఆర్భాటం మంత్రాన్ని ప్రకాశింపచేస్తున్నారు, వారు టెక్నాలజీని సమాచారం మరియు సాధికారతకు మార్గంగా భావిస్తున్నారు. షాపర్స్ గా, వారు 'ప్రతి చోట వాణిజ్యం' , సౌకర్యాన్ని కేవలం ఒక బటన్ ను క్లిక్ చేసి మరియు ఈ అవసరాన్ని తీర్చడానికి మేము ఆన్ లైన్ స్టోర్ ఫ్రంట్ 'నెక్ట్స్ జన్ స్టోర్'ను జన్-జడ్ కోసం ప్రత్యేకంగా ప్రారంభించాము, ఇటువంటి స్టోర్ భారతదేశంలో ఏర్పాటవడం ఇదే మొదటిసారి. ఈ విలక్షణమైన స్టోర్ ఫ్రంట్ జన్ జడ్ ఇష్టపడే 200 + బ్రాండ్స్ ను ప్రదర్శిస్తుంది మరియు వ్యక్తిత్వం, స్వీయ-వ్యక్తీకరణ మరియు స్వీయ-ప్రేమను వెల్లడించే వారి వార్డ్ రోబ్ అవసరాలను తీర్చే లక్ష్యాన్ని కలిగి ఉంది."
స్టోర్ ఫ్రంట్ 90లలోని గ్రంజ్, వై2కే క్వీన్, కే-పాప్ స్క్వాడ్, కంట్రీసైడ్ రొమాంటిక్, బార్బీ బే అకాడమియా చిక్ మరియు ఇంకా ఎన్నో ఎంపికలతో సృజనాత్మకంగా రూపొందించబడింది. అందరి ఫ్యాషన్ అవసరాలను సమగ్రంగా తీర్చే మార్కెట్ ప్రదేశంగా, మేము ఈ వయో సమూహానికి చెందిన ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండే ఫ్యాషన్ అవసరాలకు తగిన వాటిని సరసమైన ధరలకు బ్రాండ్స్, స్టైల్స్ , డిజైన్స్ మరియు ఫిట్టింగ్స్ యొక్క పెద్ద కలక్షన్స్ ఈ శ్రేణిలో మేము అందిస్తాము.”
కొత్త 'నెక్ట్స్ జన్ స్టోర్’ సోషల్ మీడియా మరియు అమేజాన్ లైవ్ పై ' 100+ ప్రముఖ జెన్ జడ్ ఇన్ ఫ్లూయెన్సర్స్ మరియు కంటెంట్ తయారు చేసే వారితో సహకరించడం ద్వారా పలు మార్గాలు ద్వారా ప్రోత్సహించబడుతుంది. జన్ జడ్ కోసం అనుకూలమైన ఫ్యాషన్ ఫార్వర్డ్ రూపం, దుస్తులు కోసం, స్టోర్ ఫ్రంట్ బడ్జెట్ బైస్, సీజన్ లో హాటెస్ట్ డ్రాప్స్ మరియు పాప్-టోన్, మెటాలిక్, ఎసిడిక్, పాస్టల్, న్యూట్రల్, మోనోక్రోమ్ నుండి కలర్ సెలక్షన్ ను ప్రదర్శిస్తుంది. 'నెక్ట్స్ జన్ స్టోర్' ప్రారంభంతో, అమేజాన్ ఫ్యాషన్ భారతదేశంవ్యాప్తంగా ఉన్న ఫ్యాషన్ ఎంపికలను సులభంగా, సరసమైన ధరలకు ఆఫర్ చేయడానికి తమ నిబద్ధతను కొనసాగిస్తుంది. కొత్త, ఫ్యాషనబుల్ మరియు ట్రెడింగ్ బ్రాండ్స్ ను కోరుకునే కస్టమర్స్ కోసం 1,600 ఫ్యాషన్ బ్రాండ్స్ నుండి 40 లక్షల స్టైల్స్ లో ఎంచుకోవడానికి అమేజాన్ ఫ్యాషన్ ఒక ప్రముఖ ఫ్యాషన్ గమ్యస్థానం.