Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 99 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 1450 మందికి పైగానే
- టాప్ 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 5 గురు
నవతెలంగాణ - బెంగళూరు
భారతదేశంలో అత్యంత కఠినమైన పరీక్షలు అనగానే మనకు గుర్తుకువచ్చేవి జేఈఈ, నీట్. ఇలాంటి పరీక్షలన కూడా చాలా ఎదుర్కుంటూ అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. దానికి కారణం... భారతదేశంలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకున్న అన్ అకాడమీ. భారతదేశంలో చాలా వేగంగా విస్తరిస్తున్న ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ అనగానే అందరికి గుర్తుకువచ్చేది అన్ అకాడమీ. జేఈఈ, నీట్ పరీక్షలకు సిద్ధమయ్యే ఎంతోమంది విద్యార్థుల ఆకాంక్షలను తీర్చిన అన్ అకాడమీ... తాజాగా ప్రకటించిన జేఈఈ అర్హత పరీక్షల్లోనూ సత్తా చాటింది. అన్ అకాడమీలో ఆన్ లైన్ ద్వారా శిక్షణ పాఠాలు నేర్చుకున్న దాదాపు 14000 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్, 2023 పరీక్షల్లో టాప్ ర్యాంకులు సాధించారు. తద్వారా అడ్వాన్స్ డ్ పరీక్షకు అర్హత సాధించారు. ఇక అన్ అకాడమీ ద్వారా పాఠాలు నేర్చుకుని టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఒక్కసారి చూస్తే... ఇషాన్ ఖండేవాల్, (ఆల్ ఇండియా ర్యాంకు 11), దేషాంక్ ప్రతాప్ సింగ్ (ఆలిండియా ర్యాంకు 12), నిపున్ గోయల్ (ఆలిండియా ర్యాంకు 13) ఉన్నారు. దాదాపు 1450కి పైగా విద్యార్థులు 99 శాతానికి పైగా మార్కులు సాధించారు. 120 మందికి పైగా విద్యార్థులు 99.9 శాతానికి పైగా మార్కులు సాధించారు.
పరీక్ష ఫలితాల్లో కీలక విషయాలు:
- టాప్ 10లో 5గురు విద్యార్థులు
- 99.9 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 120 మందికి పైనే
- 99 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 1450 మందికి పైనే
- టాప్ 1000లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 91 మంది
జేఈఈ పరీక్షకు సిద్ధమవ్వాలంటే అందుకు ప్రముఖ ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ అయినటువంటి అన్ అకాడమీ కచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే పీయూష్ మహేశ్వరి, బ్రిజేష్ జిందాల్, మహ్మద్ కాషిఫ్ ఆలం లాంటి అగ్రశ్రేణి విద్యావేత్తలు ఇక్కడ ఆన్ లైన్ లో పాఠాలు బోధిస్తారు. వీరి పాఠాలు విన్న విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో రాణించగలుగుతున్నారు. ఇంకా, భారతదేశంలోని వివిధ నగరాల్లో ఇటీవలే అనాకాడెమీ సెంటర్ లు ప్రారంభం అయ్యాయి. వీటిల్లో జేఈఈ అభ్యాసకులు హై-టెక్ మౌలిక సదుపాయాలతో ప్రీమియం లెర్నింగ్ అనుభవాన్ని అందిస్తున్నారు.