Authorization
Mon April 07, 2025 08:00:52 pm
- విభిన్న విభాగాలలో 3.20 కోట్ల రూపాయల విలువైన గ్రాంట్‌ను అందజేయబడుతుంది
- మే 03 నుంచి 05 జూన్ 2023 వరకూ దరఖాస్తులు తెరిచి ఉంటాయి
నవతెలంగాణ - హైదరాబాద్
భారతదేశంలో సహజసిద్ధమైన ఆవాసాలు మరియు వాటి స్వదేశీ జాతుల రక్షణ మరియు భద్రత కోసం శ్రమిస్తున్న లాభాపేక్షలేని సంస్ధ, హాబీటట్స్ ట్రస్ట్ తమ వార్షిక హాబిటట్స్ ట్రస్ట్ గ్రాంట్స్ 2023 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ దరఖాస్తులను సమర్పించడం కోసం https://www.thehabitatstrust.org వెబ్‌సైట్‌ను చూడవచ్చు. ఈ దరఖాస్తులను 05 జూన్ 2023 వరకూ సమర్పించవచ్చు. భారతదేశంలో ముప్పు అంచున ఉన్న వన్యప్రాణులు మరియు సహజ ఆవాసాల పరిరక్షణ మరియు భద్రత కోసం కృషి చేస్తోన్న మద్దతు సంస్ధలు , వ్యక్తుల పరిరక్షణ ప్రయత్నాలను మెరుగుపరచడంతో పాటుగా ప్రోత్సహించేందుకు ఈ గ్రాంట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారతదేశవ్యాప్తంగా పరిరక్షకులతో అనుసంధానించబడేందుకు ఐదు నగరాలలో సింపోజియంలను సైతం నిర్వహించనుంది. ఈ నగరాలలో పూనె (ఫెర్గ్యుషన్ కాలేజీలో 12 మే సాయంత్రం 3.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ), హైదరాబాద్ (బి హబ్, బంజారాహిల్స్‌లో 19 మే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ) ; బెంగళూరు, కోల్‌కతా, డెహ్రాడూన్ ఉన్నాయి. ఈ సింపోజియంలు 12 మే నుంచి 27 మే 2023 వరకూ జరుగనున్నాయి. వీటిద్వారా సంభావ్య దరఖాస్తుదారులకు గ్రాంట్ యొక్క కార్యక్రమాలు, ఎంపిక ప్రక్రియ గురించి మార్గనిర్దేశనం చేయనున్నారు.
THT Grants విజయం గురించి ద హాబిటట్స్ ట్రస్ట్ హెడ్ రుషికేష్ చవాన్ మాట్లాడుతూ ‘‘ పరిరక్షణ ప్రయత్నాలపై ఈ గ్రాంట్లు చూపుతున్న ప్రభావం పట్ల సంతోషంగా ఉన్నాము. అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్న జాతుల పునరుద్ధరణ మొదలు క్షీణించిన ఆవాసాల పునరుద్ధరణ వరకూ, మేము మద్దతు అందించిన ప్రాజెక్టులలో గొప్ప పురోగతిని మేము చూశాము. 2020 సంవత్సరంలో నేచర్ కన్జర్వేషన్ షౌండేషన్ (ఎన్సీఎఫ్) కు ఈ గ్రాంట్‌ను అందజేయడం ఒక ముఖ్య ఉదాహరణ గా చెప్పవచ్చు. ఈ గ్రాంట్ తోడ్పాటుతో తమిళనాడులోని వలపరి ప్రాంతంలో ఏనుగుల మరణాలు గత సంవత్సరంన్నర కాలంలో నమోదు కాలేదు. ఈ ఫలితాలు , పర్యావరణ పరిరక్షణలో మా వ్యూహాత్మక పెట్టుబడులు అసలైన ప్రభావాన్ని చూపుతున్నాయని తెలుపుతున్నాయి’’ అని అన్నారు.
భారతదేశపు జీవవైవిధ్యంపై పనిచేస్తున్న సంభావ్య గ్రాంటీలు మరియు లాభాపేక్ష లేని సంస్ధలు ఈ గ్రాంట్ల కోసం ఈ దిగువ విభాగాలలో దరఖాస్తు చేయవచ్చు. మొత్తంమ్మీద 3.20 కోట్ల రూపాయలను బహుమతిగా అందజేస్తారు. ఈ విభాగాలలో ...
- రెండు సంస్ధలకు ఒక కోటి రూపాయల చొప్పున THT Conservation గ్రాంట్ : ద హ్యాబిటట్స్ ట్రస్ట్ కన్జర్వేషన్ గ్రాంట్ ను పెద్దగా తెలియని జాతుల పరిరక్షణ మరియు అతి క్లిష్టమైన ఆవాసాల రక్షణకు కృషి చేస్తున్న సంస్ధలకు మద్దతు అందించేందుకు ఇస్తారు. భారతదేశంలో అత్యంత క్లిష్టమైన పరిరక్షణ సవాళ్లు అయిన ఆవాసాల క్షీణత, విధ్వంసం, జీవవైవిధ్యం కోల్పోవడం, అంతరించిపోతున్న జాతుల పరిరక్షణ, మానవ – వన్యప్రాణుల సంఘర్షణ సహా పలు సవాళ్లను అధిగమించడంలో శ్రమిస్తున్న గ్రాంటీలకు ఇది సహాయం చేస్తుంది. ఈ గ్రాంట్‌ను వన్యప్రాణుల పరిరక్షణలో కనీసం ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్న సంస్ధలకు మాత్రమే అందిస్తారు. ఎంపిక చేయబడిన ప్రాజెక్టులను మూడేళ్ల కాలంలో అమలు చేయాల్సి ఉంటుంది.
- మూడు సంస్ధలు / వ్యక్తులకు 25 లక్షల రూపాయల చొప్పున THT Action Grant : ద హ్యాబిటట్స్ ట్రస్ట్ యాక్షన్ గ్రాంట్ ను పెద్దగా తెలియని జాతుల పరిరక్షణ మరియు అతి క్లిష్టమైన ఆవాసాల రక్షణకు కృషి చేస్తున్న సంస్ధలు/వ్యక్తులకు మద్దతు అందించేందుకు ఇస్తారు. కనీసం రెండు సంవత్సరాలు ఈ కారణాల కోసం ఎంపిక కాబడే సంస్థలు/వ్యక్తులు పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన ప్రాజెక్ట్‌ను రెండు సంవత్సరాల వ్యవధిలో అమలు చేయాల్సి ఉంటుంది.
2022 సంవత్సరంలో మొత్తంమ్మీద 3.22 కోట్ల రూపాయలను ఎంపికైన గ్రాంటీలు మరియు ఫైనలిస్ట్‌లకు అందజేశారు. నాలుగు THT Action Grant ద్వారా గ్రాంటీలు (HT Lalremsanga, Bombay Natural History Society, The ERDS Foundation and ATREE) 25 లక్షల రూపాయల చొప్పున అందుకున్నారు. రెండు THT Conservation Grant గ్రాంటీలు ఒక్క కోటి రూపాయల చొప్పున (The Forest Way and Gurukula Botanical Sanctuary) అందుకున్నారు. ఆరుగురు ఫైనలిస్ట్‌లు రెండు లక్షల రూపాయలు, నలుగురు ఫైనలిస్ట్‌లు ఐదు లక్షల రూపాయలు అందుకున్నారు.
ఎంపిక ప్రక్రియ
శాస్త్రవేత్తలు, సబ్జెక్ట్ మ్యాటర్ నిపుణులతో సహా పరిరక్షణ రంగానికి చెందిన నిపుణుల బృందం ద్వారా గ్రాంట్ల కోసం దరఖాస్తులను పలు అంచెలలో పరీక్షిస్తారు. ఈ నిపుణులు రెండు విభాగాలలో 30కు పైగా దరఖాస్తులను ఎంపిక చేసి ఫీల్డ్ ఇవాల్యుయేషన్ రౌండ్ ద్వారా మొత్తంమ్మీద 20 అప్లికేషన్లను ఫైనల్ జ్యూరీ రౌండ్‌కు ఎంపిక చేస్తారు. హ్యాబిటట్స్ ట్రస్ట్ గ్రాంట్స్ 2023లో ఐదుగురు, వీరిలో ఇద్దరు THT Conservation Grant కోసం ముగ్గురు THT Action Grant కోసం ఎంపిక చేస్తారు. ఈ విజేతలను సంవత్సరాంతంలో ప్రకటిస్తారు. దరఖాస్తులను ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క ఔచిత్యం, ఆశించిన పరిరక్షణ ప్రభావం తదితర అంశాల ఆధారంగా పరిశీలిస్తారు.
2022లో ద హ్యాబిటట్స్ ట్రస్ట్ మరో విభాగం – THT Seed Grant ను సైతం పరిచయం చేసింది. దీనిద్వారా సపోర్టింగ్ అప్లికెంట్స్‌కు మూడు లక్షల రూపాయల చొప్పున అందజేయడాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ గ్రాంట్‌ను తక్కువ తెలిసిన జాతులు/ఆవాసాలు లేదా తక్కువగా అన్వేషించిన ప్రాంతాలలో పైలెట్ ప్రాజెక్ట్‌లు లేదా సరైన సమాచారం లేని జాతులకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే చిన్న, పరిమిత వ్యవధి ప్రాజెక్ట్‌లు లేదా పరిరక్షణ పరిశోధన ప్రయత్నాలపై పనిచేసే సంస్ధలు, వ్యక్తులకు మద్దతు అందిస్తుంది. కొత్త పద్ధతులు పరీక్షిస్తున్న లేదా వేగవంతంగా సర్వేలను నిర్వహిస్తున్న దరఖాస్తుదారులు ఈ గ్రాంట్ పొందేందుకు అర్హులు. గత సంవత్సరం ఈ గ్రాంట్‌ను ఫీదర్ లైబ్రెరీ, నాగ్‌పూర్ సెంటర్ ఫర్ పీపుల్స్ ఫోరమ్ అందుకున్నాయి.