Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారీ ఆఫర్లతో సమ్మర్ సేల్‌ను ప్రారంభిస్తున్నట్లు అమెజాన్ ఇండియా తెలిపింది. మే 4 నుంచి 8 తేదీల్లో ఈ క్యాంపెయిన్ ఉంటుందని వెల్లడించింది. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, కిరాణా సరుకులు, గృహోపకరణాలు తదితర ఉత్పత్తులపై గొప్ప తగ్గింపు ఆఫర్లను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఫ్రైమ్ సభ్యులకు మే 2 అర్థరాత్రి నుంచే సేల్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.