Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తమ యాప్ లో UPI LITE ఫీచర్ ప్రారంభించినట్టు PhonePe నేడు ప్రకటించింది. పిన్ ఏదీ ప్రవేశపెట్టకనే తమ UPI LITE ఖాతాతో ఒకే ట్యాప్ ద్వారా ₹ 200కన్నా తక్కువ విలువ కలిగిన పేమెంట్లను ప్రారంభించేందుకు ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. కస్టమర్ల బ్యాంకుల (స్వీకర్త బ్యాంక్) కోర్ బ్యాంకింగ్ సిస్టంల ప్రమేయం లేకుండా తక్షణమే సాధనంలోనే UPI LITE బ్యాలెన్స్ ను డెబిట్ చేయడం ద్వారా ఈ లావాదేవీ ప్రాసెస్ చేయబడుతుంది. దీనివల్ల లావాదేవీ సంభావ్యత పెరగడంతో పాటు లావాదేవీలు రెగ్యులర్ లావాదేవీలకన్నా మరింత నిరంతరాయంగా, మరింత వేగవంతంగా జరుగుతాయి. PhonePeలో UPI LITEకు అన్ని ప్రధాన బ్యాంక్ లు మద్దతు ఇస్తాయి. దేశవ్యాప్తంగా అన్ని UPI మర్చంట్లు మరియు QRలలోనూ అంగీకరించబడుతుంది. ఈ ఫీచర్ అత్యంత రద్దీ వేళల్లోనూ కిరాణా సరకులు, ప్రయాణాలు లాంటి తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు మరింత వేగవంతమైన తక్షణ పేమెంట్ పరిష్కారాలకు సాధనంలో అప్పుడున్న బ్యాలెన్స్ ద్వారా వీలు కల్పిస్తుంది.
ఎలాంటి KYC ప్రమాణికీకరణ అవసరం లేకుండానే వినియోగదారులు ఈ ఫీచర్ ను వారి PhonePe యాప్ లో చాలా తేలికైన ప్రక్రియ ద్వారా యాక్టివేట్ చేసుకుని, UPI LITE ఖాతాను రూపొందించుకోవచ్చు. వినియోగదారులు వారి LITE ఖాతాలో ₹ 2000 వరకు లోడ్ చేసుకుని, ఒకే ప్రయత్నంలో ₹ 200 లేదా అంతకన్నా తక్కువ మొత్తం వరకు లావాదేవీలు జరపవచ్చు. లావాదేవీల చరిత్రను చెక్ చేయడం కోసం, వారి బ్యాంక్ నుండి ఆ రోజులో చేపట్టిన UPI LITE లావాదేవీల చరిత్రను కలిగిన రోజువారీ SMSను వినియోగదారులు అందుకుంటారు. లావాదేవీలు బ్యాంక్ స్టేట్ మెంట్ బదులు కేవలం LITE ఖాతాలో మాత్రమే కనిపిస్తున్నందున ఇది చిన్న విలువ కలిగిన లావాదేవీలతో బ్యాంక్ స్టేట్మెంట్లు/పాస్‌పుస్తకాలు పేరుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ ప్రకటన చేసిన సందర్భంగా PhonePe కో-ఫౌండర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రాహుల్ చారి మాట్లాడుతూ, “UPI లైట్ అనేది తరచూ చేసే తక్కువ విలువ కలిగిన ఖర్చులకోసం వినియోగదారులకు డిజిటల్ పేమెంట్ల అనుభవాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో UPI స్టేక్ ఆఫరింగ్ లో ముఖ్య భూమిక పోషిస్తుంది. మొత్త UPI పేమెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో UPI LITE తక్కువ ఖర్చు లావాదేవీలను ప్రస్తుతమున్న UPI మౌలిక లావాదేవీలపై భారం పడకుండా త్వరగా, సౌకర్యవంతంగా చేస్తుంది. నెట్ వర్క్ కనెక్టివిటీ అవసరం లేకనే పేమెంట్ అమలు చేసే సందర్భాలను ప్రవేశపెట్టేందుకు కూడా UPI Lite మార్గాన్ని సుగమం చేయడం ఇటీవలి కాలంలో NPCI నుండి వచ్చిన అత్యంత ఉత్సాహపూరితమైన ఆవిష్కరణల్లో ఒకటిగా దీనిని చేస్తోంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు డిజిటల్ పేమెంట్ల స్వీకరణను పెంచే దిశగా ఇది ఒక కీలక అడుగు కానుంది. తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. వేగవంతమైన, అంతరాయం లేని తక్కువ విలువ పేమెంట్ల కోసం మేము ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ను భారతదేశం స్వాగతించగలదని ఆశిస్తున్నాము.” అని చెప్పారు.