Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
ఉగాది | కవర్ స్టోరీ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి
  • Apr 10,2021

ఉగాది

       చైత్ర శుద్ధ పాడ్యమి తెలుగు వారంతా ఘనంగా జరుపుకునే పర్వ దినం. సంవత్సరాది, యుగాది, ఉగాది పేరు ఏదైనా అదొక ఉత్సవ సందర్భం. ఆదీ, అంతమూ లేని కాల మహా ప్రవాహంలో ఎక్కడో ఒక చిన్న కొసను పట్టుకుని ఇది కాల మూలం, ఇక్కడి నుండి కాలం మొదలు అయిందని ఏవో లెక్కల కోసం మనం చెప్పుకుంటాము కానీ
ఉన్నదొకటే కాలం. అది అనంతం. అఖండం.
       ఉగాది పర్వదిన ఆరంభానికి ప్రజలలో అనేక కథలున్నాయి. పురాణాల పరంగా వివరణలూ ఉన్నాయి. మనకు దేనికయినా ఒక ఆరంభం, ఒక ముగింపును అనుకోవటం, ఆయా సందర్భాలలో శుభాలు కలగాలని కోరుకోవటం అనాదిగా అలవాటు. అలవాట్లు సంప్రదాయాలుగా మారతాయి. సంస్కృతిలో భాగమవుతాయి. చివరన కలిగే విజయాలకు ఆరంభమే కారణమనుకుంటాము. ఎందుకంటే ముందుగానే విజయాన్ని ఊహించుకుంటాము. అది ముందుకు పోవటానికి ఘనమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. మనం కాలానికి కొన్ని గీతలు పెట్టుకుని పనిలోకి దిగి పూర్తి చేస్తాము. పని అంటే శ్రమ. శ్రమ ఎప్పుడూ గొప్ప ఫలితాన్నే ఇస్తుంది. ఫలితం సరిగా లేదంటే ఏదో దగా జరిగిందనే భావించాలి. అలాంటి దగాలు, మోసాలు, ఆటంకాలు లేకుండా ఉండాలని ఆరంభ కాలంలోనే నలుగురూ కలిసి కలబోసుకునే పండుగే ఉగాది. శాలివాహన చక్రవర్తి ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే పట్టాభిషిక్తుడై, ఆ తరువాత యుగకర్తగా భాసిల్లాడు కనుక, ఆ శాలివాహన యుగ సూచకంగా ఉగాది సంతోష సంరంభం ప్రారంభమైనదని మరొక చారిత్రక వత్తాంతం. ఇక మన సంప్రదాయక పండితులు యుగాదిని రకరకాలుగా వర్ణించారు. అనేక అర్థాలను చెబుతూ వస్తున్నారు. వాటినొకసారి చూద్దాము...
       ప్రభవ నుండి అక్షయ వరకు ఉన్న అరవై సంవత్సరాల కాల చక్రంలో రానున్న ప్లవ నామ సంవత్సరం 35వ సంవత్సరం. తెలుగు సంవత్సరాలలో మొదటిది ప్రభవ. ప్రభవ అంటే పుట్టుక, తెలివికి మొదటి చోటు.. చివరిది క్షయ. క్షయ అంటే నాశనమయ్యేది. ప్రతి సంవత్సర నామానికి ఒక విశేషం ఉన్నట్టుగానే ప్లవ నామ సంవత్సరానికి వున్న విశేష అర్ధం ఏమిటంటే ప్లవ అంటే ప్రవహించునది అని అర్ధం. అంటే ఈ సంవత్సరం జల ప్రవాహాలు సమద్ధిగా ఉంటాయన్నమాట.
       మన ఉగాది చైత్ర మాసంతోనే ఎందుకు మొదలవుతుంది అనే ప్రశ్నకు హెమాద్రి పండితుడు : చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రధమేహని, శుక్ల పక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి. చైత్రశుద్ధ పాడ్యమి సూర్యోదయ సమయంలో బ్రహ్మ ఈ జగత్తును సంపూర్ణంగా సష్టించాడు అని సమాధానం చెప్పాడు. ఋతుచక్ర భ్రమణంలో శిశిరం తరువాత వసంతం వస్తుంది కనుక, శిశిరంలో మోడులైన తరువులన్నీ చివురుల మొగ్గలు తొడిగి, పుష్పించి ప్రకతికి శోభను చేకూరుస్తాయి కనుక, శిశిర కాలం నాటి నిరాశల, నిరుత్సాహాల, వేదనలు తొలగిపోయి ప్రకతి ఒక సానుకూల ధక్పథంతో ముందుకు సాగుతుంది కనుక, ప్రకతికీ, మనిషికీ మధ్య ఉన్న అవిభాజ్య సంబంధం కారణంగా మనిషి ఉగాది నుండీ జీవన సమరంయానంలో మళ్ళీ ఒక కొత్త ప్రారంభం చేస్తాడని, ఆశలు మోసులెత్తగా ఉత్సాహభరితుడు అవుతాడని అసలు సిసలు అర్ధం. ఉగాది నుండే వసంత మాసం ప్రారంభం.
       భగవద్గీతలో శ్రీకష్ణుడు అంటాడు ''ఋతూనం కుసుమాకరః'' అని. అంటే రుతువులు అన్నిటిలో నేను వసంతాన్ని అని అర్ధం. ఆదిశంకరులు ఒక కష్టం వెంటే మరొక సుఖం కూడా ఉంటుందని చెప్పడానికి ''శిశిర వసంతౌ పునారాయాతః'' అంటాడు. వసంతం వచ్చిందంటే శిశిరం సెలవు పుచ్చుకున్నట్టే కదా. హదయం లోపల ఒక చిన్న ఆశ మొలకెత్తితే చాలు ఎంత పెద్ద నిరాశల నిర్వేదనల సముద్రమైనా తీరం నుండి లోలోపలికి కుంచించుకుని వెళ్ళవలసిందే.
భరతాచార్యులు నాట్యశాస్త్రంలో రసాలకు రంగులున్నా యని చెబుతూ ''శ్యామో భవతి శంగార'' అన్నారు. వసంతం అంటే ఆకుపచ్చని తనం. శంగారం అన్నా కూడా ఆకుపచ్చదనమేనట. ఆకుపచ్చని, ఆశల వెచ్చని జీవన కాంక్షను మోసుకొచ్చే ఉగాది తెలుగువారికి మాత్రమే పండుగ కాదు, మరాఠీలు ఈ పండుగను ''గుడి పర్వా'' పేరుతోనూ, తమిళులు ''పుత్తాండు'' అనీ, మలయాళీలు ''విషు'' అనే పేరుతోనూ, బెంగాలీలు ''పోరు లా బైశాఖ్‌'' గానూ జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాలలో వివిధ నామాలతో జరుపుకుంటున్నా పండుగ జరుపుకునే రీతి మాత్రం ఒక్కటే.
       ఉగాది అనగానే తెలుగువారికి గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం. ఉగాదితో ఈ మూడింటికీ అవినాభావ సంబంధం వుంది. ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది.
దీనికి కావలసిన పదార్డాలు: వేప పువ్వు-బెల్లం పొడి , కొబ్బరికోరు-, బాగా మగ్గిన అరటి పండ్లు-, మామిడికాయ-,కొత్తకారం-, ఉప్పు-, శనగట్నాల పప్పు పొడి-, చింతపండు-నిమ్మకాయ, కొద్దిగా చెరుకుముక్కలు, వేయించిన వేరు శనగపప్పు. చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్నముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్కతీసి చిన్నముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి. వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరున వేపపువ్వు కలపాలి.. చేదు, పులుపు వగరు తీపి రుచుల కలయికే జీవితం అని చెప్పడానికి. ఈ ఆరు రుచులు లేకపోతే ఉగాది పచ్చడికి రుచి ఎలా రాదో, సుఖం, దుఃఖం, ఆశ, నిరాశ, లేకపోతే జీవితంలో కూడా రుచి ఉండదు.
       ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీక.
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
వేప పువ్వు - చేదు - బాధకలిగించే అనుభవాలు
చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు
       ఇక పంచాంగ శ్రవణం సంగతి చెప్పనే అవసరం లేదు. రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో దేశం ఎలా ముందుకు నడవబోతున్నదో సూచనప్రాయంగా తెలియజేస్తుంది పంచాంగ వివరణ. ఆధునిక కాలంలో ఈ పంచాంగ శ్రవణానికి పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా అనూచానంగా వస్తున్నా సంప్రదాయం కనుక అందరూ పాటిస్తున్నారు. తెలుగువారు ఉగాది నాడు పంచాంగ శ్రవణం జరుపుట ఆచారంగా వస్తుంది. పంచాంగ శ్రవణంలో ఆ సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవొచ్చు. ఆ సంవత్సరంలో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా అలోచించి తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.
       కవి సమ్మేళనాలు తెలుగు సమాజానికి కొత్తకాదు. తెలుగు వాళ్ళలో ప్రతి ముగ్గురిలో ఒక కవి కచ్చితంగా ఉంటాడు. కవి ఉగాది రోజు కవి సమ్మేళనంలో కవిత చదివితే సంవత్సరమంతా తన కవిత్వానికి ఇక ఢోకా ఉండదని నమ్ముతారు. కవిసమ్మేళనంలో పలికే కోయిలలు మళ్ళీ ఉగాది వచ్చేదాకా నిదుర పోనివ్వవు.
       తెలుగు వారి పండుగలన్నీ సైన్సు, తర్కము, ఆధ్యాత్మికత కలగలసిన పండుగలు. ఆ పర్వదినాలలో ఆచరించవలసిన ప్రతి కత్యం వెనుకా కొంత ఆధ్యాత్మికత, మరికొంత శాస్త్రీయ దక్పథమూ కలగలసి ఉంటాయి. అయితే ఈ అత్యాధునిక యుగంలో పండుగలు వాటి ప్రాశస్త్యాన్ని కోల్పోయి కేవలం సెలవు దినాలుగా మారుతున్నాయి. పండుగలు జరుపు కుంటున్నచోట కూడా వాటిని వాటి అంతఃస్సారంతో కాకుండా కేవలం ఒక తంతులా జరుపుకోవడం ఇవాళ్టి ఒక విషాదం.
అందరికీ ప్లవ నామ ఉగాది శుభాకాంక్షలు
- హర్ష నేత్ర

ఆరుకునుడు

నేను లెవ్వకముందే
అమ్మలేసి అలుకుజల్లి
అన్నం వండి పెరుగు కలిపి
సద్ది పెడ్తది గొంత అంబలి
కూడా కాస్తది...

నాన్న ముందు రోజే
అడ్ల బమ్మయ్యతో
గుంటుక సరిజేయించి
మబ్బులనే ఎడ్లకు
గుంటుకకు, గొడ్డలికి
సున్నం కుంకుమ పూత్తడు...

నేను లేసి
బుడబుడ తానంజేసీ
బట్టలేసుకొని
నెత్తిల సుట్టవట్ట
దానిమీద గంప ,
సేతిల గొడ్డలి వట్టుకుంటే.....

నాన్న ఎడ్లకు
గుంటుక కట్టి
తుమ్మడ్లల్లకు పోతాం....
నాన్న గుంటుకతో సాగుజేస్తే
నేను గొడ్డలితో
ముండ్ల కంపలు నరుకుతా....

కొద్దిసేపు అయినంక
గంపలకెయ్యి
తువ్వాలలగట్టిన సద్ది
నీళ్లు, అంబలి బయటికి తీసి
కందిపొట్టు ఎడ్ల ముంగటపోసి

సద్ది తినుకుంటా
ఉల్లిపాయ కొరుక్కుంటా
మిరపకాయ నములుకుంటా
అంబలి తాగుకుంటా
ముచ్చట్లు వెడతం...

మళ్ళా కొద్ది సేపు సాగుజేసీ
ఇంటికిజేరితం...
ఒక్కరోజు ముఖ్యమంత్రి లెక్క
నాకు ఒక్కరోజు ఎవుసం...
ఆరుకునుడే పండగంటే మాకు
ప్రతి ఉగాది దెవుసం...
- వినయ్‌ కుమార్‌ కొట్టే
7032629768

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కుటుంబ వ్య‌వ‌స్థ‌
ఒక మ‌న‌సు పుట్టిన‌రోజు
''మేడే'' - నిరంత‌ర చైత‌న్య స్ఫూ‌ర్తి
పుస్తకం జిందాబాద్‌! పుస్తకం సంస్కృ‌తి వ‌ర్థి‌ల్లా‌లి..
నాటక విశ్వవిద్యాలయం రావాలి
ప్ర‌జాతంత్ర భార‌త ప్ర‌వ‌క్త బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌
ప్రపంచ పిల్లల పుస్తక దినోత్సవం
రంగ‌స్థ‌ల‌మే ఆయుధం
చైత్రారంభ‌మే ఉగాది మ‌న ఆశ‌ల‌కు కొత్త పునాది
మొదటి అడుగు వినియోగదారునిదే
ఏ వెలుగులకీ పిలుపులు?
సైన్స్- ప్ర‌జ‌ల చేతిలో ఒక ఆయుధం
'రెడ్‌ బుక్స్‌ డే'కు జేజేలు!!
భూ ప్ర‌ళ‌యం... జ‌న విల‌యం...
కళాతపస్వి విశ్వనాథ్‌
అందాల చంద‌మామ‌...తెలుగుతెర స‌త్య‌భామ‌...
రాజ్యాంగ స్ఫూర్తి ఏది?
సంక్రాంతి సంద‌డి
కోటి ఆశ‌ల‌తో కొత్త ఏడాదిలోకి
పుస్త‌క‌మేవ జ‌య‌తే
ఐదు దశాబ్దాల సహజత్వం జయసుధ సినీ ప్రస్థానం
హస్తకళల పట్టుకొమ్మలు.. నిర్మల్‌ కొయ్యబొమ్మలు
నాటి నవ్వుల కలలరాణి షర్మిలా ఠాగూర్‌
అవగాహన! అప్రమత్తత!!
ఆన్‌లైన్‌లో తెవెలుగు
రిషి సునాక్‌ మన ''వాడా'' బ్రిటీష్‌ మనిషా!
పర్యావరణం!
తారా ప్రపంచంలో తళుక్కుమన్న రేఖ
మానవాభివృద్ధికి మార్గాలు.. పుస్తకాలు..
ఆహారం భద్రమేనా?

తాజా వార్తలు

03:17 PM

ఒక్క బంతికి 18 పరుగులు…

03:16 PM

రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి.. .

03:07 PM

ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు..

02:30 PM

క‌ర్ణాట‌క కొత్త సీఎంగా సిద్ధ‌రామ‌య్య!.. డీకేకు ఛాన్స్ !

02:19 PM

8వ తరగతి చదువుతున్న 15 ఏళ్ల ఓ విద్యార్థి మృతి

01:50 PM

విలీన గ్రామాల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: గవర్నర్‌ తమిళిసై

01:22 PM

ట్రావెల్ నౌ, పే లేటర్.. రైల్వేలో కొత్త ఆఫర్

01:19 PM

దేశంలో కొత్తగా 1,021 కరోనా కేసులు

12:25 PM

కర్ణాటక సీఎం రేసులో ట్విస్ట్

12:10 PM

తెలంగాణలో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు

11:59 AM

సుప్రీంలో ఎంపీ అవినాష్‌కు దక్కని ఊరట

11:34 AM

శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన రికార్డు...

11:00 AM

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మెరిసిన సారా అలీ ఖాన్‌

10:49 AM

100 గంటలు వంట చేసిన నైజీరియా మహిళ

10:15 AM

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

10:01 AM

నేడు టీఎస్‌ పాలీసెట్ ప‌రీక్ష‌

09:46 AM

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్‌

09:31 AM

నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళిసై పర్యటన

09:21 AM

దుబాయ్‌లో కేర‌ళ వాసి అనుమానాస్పద మృతి

08:50 AM

ప్రధాని కార్యక్రమంలో కేంద్ర మంత్రి కునుకుపాట్లు

08:13 AM

పల్నాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల మృతి

08:10 AM

రోడ్డు ప్ర‌మాదంలో అసోం ‘లేడీ సింగం’ జున్‌మోనీ రాభా మృతి

07:47 AM

నేడు బీఆర్‌ఎస్‌ కీలక సమావేశం

06:38 AM

తుర్కయాంజల్ వద్ద రోడ్డు ప్ర‌మాదం..న‌లుగురు మృతి

08:50 PM

కుక్క కాటుకు గురైన అర్జున్ టెండూల్కర్

08:38 PM

ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష ఫీజు గ‌డువు పొడిగింపు

08:29 PM

మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ

08:20 PM

యాదగిరిగుట్టలో ఆన్‌లైన్‌ సేవలు పునఃప్రారంభం

08:01 PM

18న తెలంగాణ క్యాబినెట్ స‌మావేశం

07:35 PM

బలగం మొగిలయ్యకు దళిత బంధు మంజూరు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.