Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని యన్మన్గండ్ల బీసీ ఇంటర్గర్ల్స్ హాస్టల్లో గురువారం పాము కలకలం సృష్టించింది. ఉదయం హాస్టల్గోడపై చెడుగు కనబడడంతో విద్యార్థులంతా అరుస్తూ పరుగులు తీశారు. ఈ గందరగోళంలో ఫస్టియర్ చదువుతున్న మమత అనే విద్యార్థిని వీపుపై పడడంతో ఆమె భయపడింది. విదిలించగా మరో నలుగురిపై పడిన చెడుగు ఎటో వెళ్లిపోయింది. కాలేజీలో పరీక్ష రాయడానికి వెళ్లిన మమత సాయంత్రం హాస్టల్కు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయింది. రెగ్యులర్వార్డెన్ మెడికల్ లీవ్లో ఉండడం, అధికారులు, హాస్టల్వర్కర్లు అందుబాటులో లేకపోవడంతో కాలేజీ లెక్చరర్లు, గ్రామస్తులు కలిసి ఆమెను ప్రైవేటు వాహనంలో జిల్లా హాస్పిటల్కు తరలించారు. నోటి నుంచి నురగ లాంటిది వచ్చిందని చెబుతున్నారు. రాత్రి వేళలో బాలికకు స్పృహ వచ్చినా స్పర్శ తెలియడం లేదని చెబుతోంది.