Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఆర్ధిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచనలో ఉందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్యగా పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బీజేపీ ఎంతకైనా తెగించేలా ఉందని అన్నారు. కేంద్ర పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ఇబ్బంది పెడుతోందని.. వ్యక్తిగత కక్షకు పాల్పడుతోందని మండిపడ్డారు. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే అభివృద్ధి చేసి చూపించాలన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.