Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో.. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 రన్స్ చేసింది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ తొలి వికెట్‌కు 124 రన్స్ జోడించారు. ధావన్ 72, గిల్ 50 రన్స్ చేసి ఔటయ్యారు. ఆ తర్వాత పంత్, సూర్యకుమార్ కూడా త్వరత్వరగా ఔటయ్యారు. అయిదో వికెట్‌కు శ్రేయాస్, సంజూ సాంసన్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ 94 రన్స్ జోడించారు.
అయ్యర్ 80 రన్స్ చేసి ఔట్ అవ్వగా, సాంసన్ 36 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక చివర్లో వాషింగ్టన్ సుందర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారీ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతను 16 బంతుల్లోనే 37 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్‌లు చెరో మూడేసి వికెట్లు తీసుకున్నారు.