Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 13పై ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఈవెంట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇప్పటికే లైవ్‌లో ఉన్న సేల్ నవంబర్ 30 వరకూ కొనసాగుతుంది. ఐఫోన్ 13పై బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లకు అదనంగా ఆకర్షణీయ తగ్గింపు లభిస్తోంది. ఆరు రోజుల పాటు ఈకామర్స్ దిగ్గజం సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా పలు డివైజ్‌లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 14 సహా పలు లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 13.. 128జీబీ మోడల్‌పై రూ. 3000 ఫ్లాట్ డిస్కౌంట్‌పై రూ. 62,999కి లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1000 ఆఫర్ లభిస్తోంది. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 17,500 వరకూ లభిస్తుండటంతో ఐఫోన్ 13ను అందుబాటు ధరలో సొంతం చేసుకోవచ్చు. మరోవైపు అమెజాన్ వంటి ఇతర ఈకామర్స్ వేదికలపై ఐఫోన్ 13 రూ . 66,900 ప్రారంభ ధరకు లభిస్తోంది. ఇక న్యూ ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400 తగ్గింపు ధరకు ఆఫర్ చేస్తుండగా ఇది కొంత భారం కావడంతో ఐఫోన్ 14 డిజైన్, ఫీచర్లు ఐఫోన్ 13కు దగ్గరగా ఉండటంతో తక్కువ ధరలోనే ఐఫోన్ 13ను కొనుగోలు చేయడం మేలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. రూ.60,000 ఖర్చు చేయలేని వారు ఐఫోన్ 12 64జీబీని ఎంచుకోవాలని, ఇది ఫ్లిఫ్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ. 48,999కి లభిస్తోంది. ఐఫోన్ 12 128జీబీ రూ .53,999కి అందుబాటులో ఉంది.