Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఇటలీ కార్ల తయారీ దిగ్గజం లాంబోర్ఘిని సూపర్ స్పోర్ట్స్ కార్లకు పెట్టింది పేరు. లాంబోర్ఘిని కార్లను భారత్ లో పలువురు సెలెబట్రీలు ఉపయోగిస్తున్నారు. టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ వద్ద కూడా లాంబోర్ఘిని కారు ఉంది. భారత్ లో తొలి లాంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్ కారును సొంతం చేసుకున్ని ఎన్టీఆరే. ఇక, ఉరుస్ శ్రేణిలో లాంబోర్ఘిని కొత్త కారును భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎస్ యూవీ సెగ్మెంట్లో ఉరుస్ పెర్ఫార్మెంటే మోడల్ ను పరిచయం చేసింది. ఉరుస్ పెర్ఫార్మెంటే ప్రారంభ ధర రూ.4.22 కోట్లు (ఎక్స్ షోరూం). ఉరుస్ స్టాండర్డ్ మోడల్ ఎస్ యూవీ కంటే పెర్ఫార్మెంటే ధర రూ.1.12 కోట్లు ఎక్కువ. ఈ కొత్త కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.3 సెకన్లలోనే అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 306 కిలోమీటర్లు. ఇది అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదలై నాలుగు నెలల్లోనే భారత్ లో అడుగుపెడుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్ యూవీగా ఉరుస్ పెర్ఫార్మెంటే గుర్తింపు తెచ్చుకుంది.