Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగారెడ్డి: హేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీ పహాడి షరీఫ్ దర్గా సమీపంలో, కొత్తపేట్ గ్రామంలో బస్తీ దవఖానాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.ఈ తరుణంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, దీంట్లో భాగంగా పేదల వద్దకే వెళ్లి ప్రభుత్వ వైద్యాన్ని అందించడం చారిత్రక నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో బస్తీలలో నివాసముండే నిరుపేదల చెంతకే వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాలు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా బస్తీ దరఖాన ఇన్‌చార్జి వినోద్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ శారద శ్రీనివాస్, జల్‌పల్లి మున్సిపాలిటీ టీఆర్‌ఎస్ అధ్యక్షులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్ధన్, కౌన్సిలర్లు శంషుద్దీన్, మజర్, కోఆప్షన్ సభ్యుడు కృష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.