Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నగరంలో మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నగరంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నగరం విస్తరిస్తున్నందున ప్రజారవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఎంఎంటీఎస్ కోసం రూ.200కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.ఈ నిధులతో ఎంఎంటీఎస్‌ను విస్తరణ చేపడుతాం. మెట్రో రెండో దశకు సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నం. సహకరిస్తారని ఆశిస్తున్నాం.
సహకరించినా, సహకరించకపోయినా మొదటి దశ ఎట్లాయితే విజయవంతంగా పూర్తి చేశామో రెండో దశను పూర్తి చేస్తాం. బీహెచ్‌ఈఎల్ నుంచి లక్డీకపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు 5 కిలోమీటర్లు, మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు కొత్తగా మెట్రో నిర్మిస్తాం. కొవిడ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం తగ్గిన విషయం మీ అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేయడంతో ఇబ్బంది ఎదురవుతున్న విషయం తెలిసిందే. రెండు కారణాలతో అనుకున్న విధంగా ప్రణాళిక ప్రకారం.. మెట్రో విస్తరించాలనుకున్నా చేయలేకపోయాం. రాబోయే రోజుల్లో దీన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే’నని కేటీఆర్ స్పష్టం చేశారు.