Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రైవేట్ రంగంలో రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన హైదరాబాద్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ అభినందన సభలో కేటీఆర్ ఈ మేరకు ప్రకటించారు. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ అంతరిక్షంలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించి చరిత్ర సృష్టించిందని భవిష్యత్తులోనూలో తెలంగాణ కేంద్రంగానే తమ కంపెనీ మరింత ముందుకు పోయే ప్రణాళికలు ఉన్నాయని స్కై రూట్ తెలిపింది. తెలంగాణలో సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇందకు సహకరించాలని మంత్రి కేటీఆర్‌ను స్కై రూట్ ఏరోస్పేస్ కంపెనీ కోరింది. ముందునుంచి స్కై రూట్‌లాంటి కంపెనీలకు మద్దతివ్వడం తమకు గర్వకారణం అన్న కేటీఆర్, ఆ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలక తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.