Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ.. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పర్వతగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పార్టీ బూత్ కమిటీలు, పెండింగ్ పెన్షన్లు, పట్టణ అభివృద్ది అంశాలను నియోజక వర్గాల వారీగా సమీక్షించారు. సమావేశానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్ హాజరయ్యారు.