Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బ్రిటన్‌లో భారతీయులు తాజాగా సరికొత్త రికార్డు సృష్టించారు. చైనా వారిని వెనక్కునెట్టి మరీ ఇండియన్స్ అత్యధికంగా బ్రిటన్ స్టూడెంట్ వీసాలు పొందిన విదేశీయులుగా రికార్డు నెలకొల్పారు. ఇటీవల కొన్నేళ్లుగా బ్రిటన్ వీసాలు పొందుతున్న భారత విద్యార్థుల సంఖ్య ఏకంగా 273 శాతం పెరిగిందని తాజాగా విడుదలైన బ్రిటన్ హోం శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమాచారం ప్రకారం.. వృత్తి నిపుణులకు ఇచ్చే వర్క్ వీసాలు పొందుతున్న విదేశీయుల్లో భారతీయులే ముందున్నారు. గతేడాది భారతీయులకు 56,042 వర్క్ వీసాలు జారీ అయ్యాయి. విదేశీ వైద్య వృత్తినిపుణులకు ఇచ్చే స్కిల్డ్ వర్క్ హెల్త్ అండ్ కేర్ వీసాల్లో ఏకంగా 36 శాతం భారతీయులే దక్కించుకున్నారు. దీంతో.. అమెరికా ప్రజావైద్య రంగంలో భారతీయుల కీలక పాత్ర పోషిస్తున్నట్టు మరింతగా తేటతెల్లమైంది.