Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్‌పుర శ్రీలంక బస్తీలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 400 మంది పోలీసులతో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తీ ఆధ్వర్యంలో ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, సబ్-ఇన్‌స్పెక్టర్లతో సహా సుమారు 400 మందికి పైగా పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ఇంట్లో ఉన్న వారి వివరాలను సేకరించారు. వాహనాల పత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బేగంపేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందన దీప్తీ మాట్లాడుతూ పత్రాలులేని 85 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని, 11 మంది అనుమానితులు, నలుగురు రౌడిషీటర్లను అదుపులోనికి తీసుకున్నాని తెలిపారు. ఓ వ్యక్తి దిచక్రవాహనంపై వెళుతుండగా పట్టుకుని తనిఖీ చేశామన్నారు. అందులో 600 గుట్కా ప్యాకెట్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీల్లో అదనపు డీసీపీ ఆశీష్‌గౌతం, ఏసీపీ పృద్వీధర్‌రావు, ఇన్‌స్పెక్టర్లు పి.శ్రీనివా్‌సరావు, డెబోరా (డీఐ)తో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.