Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నేడు 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కాగా.. శుక్రవారం 60,157 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న స్వామివారికి 31,445 మంది తలనీలాలు సమర్పించారు. వీఐపీ బ్రేక్ దర్శనాల్లో టీటీడీ మార్పులకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి ఉదయం 8 గంటల నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలను నిర్వహించనుంది. నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా నిర్వహించనుంది.