Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కుటుంబ తగాదాల కారణంగా జీవితంపై విరక్తి చెందిన ఓ ఆర్‌ఎంపీ వైద్యురాలు బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అల్వాల్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. అల్వాల్ మండపం (టెంపుల్ అల్వాల్) ప్రాంతానికి చెందిన జయశీల(60), ఆనందమూర్తి భార్యాభర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు ఉద్యోగ రీత్యా అమెరికాలో సెటిల్ అయ్యారు. దీంతో తరచుగా జయశీల, అనందమూర్తి ఆమెరికాకు వెళ్లి వస్తుంటారు. తాజాగా నాలుగు నెలలు యూఎ్‌సఏ లో ఉన్న ఆ దంపతులు గురువారం నగరానికి వచ్చారు. కాగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు పాల ప్యాకెట్ తీసుకువస్తానని భర్తకు చెప్పిన జయశీల తన ఇంటికి సమీపంలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తుకు చేరుకొని పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలాఉండగా, నాలుగేళ్ల క్రితం భర్త ఆనందమూర్తి(70) తన ఆహార పదార్థాలలో స్లోపాయిజన్ ఇస్తున్నాడని జయశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె మానసిక ఇబ్బందితో బాధపడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.