Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దోపిడీ దొంగలు రొచ్చిపోతున్నారు. రాత్రిలేదు పగలూ లేదు.. ఎక్కడపడితే అక్కడ అందినకాడికి దోచుకెళ్తున్నారు. మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌కి చొరబడి తుపాకులతో బెదిరించి 16 కిలోల బంగారం, రూ.3.5లక్షల నగదును లూటీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలోని రంగనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్గన్వా ప్రాంతంలో సినీ ఫక్కీలో ఈ ఘటన చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. కట్నీ జిల్లాలో మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లోకి ఉదయం 10.25 గంటల నుంచి 10.40 గంటల మధ్య ఆరుగురు సాయుధులు చొరబడ్డారు. ఆ సమయంలో ఓ ఉద్యోగి గోల్డ్ లోన్ ఫైనాన్స్ ఊడుస్తున్నాడు. అదే సమయంలో ఆయుధాలతో ఉన్న దుండగులు ముఖానికి గుడ్డ కట్టుకొని, తలకు హెల్మెట్ పెట్టుకొని లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత తుపాకీని బయటకు తీసి ఫైనాన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై దాడి చేసి పక్కకు తీసుకెళ్లారు. తుపాకీతో బెదిరించి లాకర్లను తెరిచి నగలు, నగదును బ్యాగుల్లో వేసుకొని పరారయ్యారు.
లాకర్‌ను ఓపెన్ చేసిన సమయంలో సైరన్ మోగగా.. అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఫోరెన్సిక్ బృందాలను వేలిముద్రలు సేకరించాయి. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టారు. అలాగే ప్రధాన రహదారులను దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఫైనాన్స్‌లో నలుగురు నుంచి ఆరుగురు దొంగలు తుపాలకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని ఏఎస్పీ మనోజ్ కేడియా తెలిపారు. నిందితులు జబల్‌పూర్ వైపు వెళ్లినట్లుగా సమాచారం ఉందని, ఉదయం 10.25 నుంచి 10.40 గంటల ప్రాంతంలో ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో సెక్యూరిటీ గార్డు ఎక్కడా కనిపించలేదని చెప్పారు. ప్రధాన కార్యాలయం నుంచి సీపీటీవీ ఫుటేజీని తెప్పించి, పరిశీలించనున్నట్లు పేరొన్నారు. నిందితులు 16 కిలోల బంగారం, రూ.3.56లక్షలు ఎత్తుకు వెళ్లినట్లు మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేల్స్ మేనేజర్ తెలిపారు. దొంగలు బ్యాంకులోకి ప్రవేశించినప్పుడు ఆరుగురు ఉద్యోగులు ఉన్నారన్నారు. మహిళా ఉద్యోగిని మినహా అందరినీ కొట్టారని, బెదిరించి బంగారం, నగదు ఎత్తుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. దాదాపు రూ.8కోట్ల విలువైన బంగారాన్ని నిందితులు దోచుకున్నారని ప్రత్యక్ష సాక్షి రాహుల్ తెలిపాడు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే దోపిడీ జరుగడంపై భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.