Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసరి జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న దూలానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ శనివారం తెలిపారు. మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల
తేదీ 25.11.2022 రోజు మధ్య రాత్రిన ఆదర్శనగర్ కి చెందిన గంగోనె వినయ్ కుమార్ [24 సంవత్సరాలు] మద్యానికి బానిస అయ్యి జీవితం పైన విరక్తి చెంది బాధ భరించలేక తనకు తానుగా ఇంట్లో దూలనికి చీరతో ఉరి వేసుకొని చనిపోయినాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.