Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా అమీతుమీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధవన్ సేన.. మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఇందులో భాగంగా హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నది. అయితే టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో కెప్టెన్ శిఖర్ ధవన్, శుభ్‌మన్‌గిల్ బ్యాటింగ్ ఆరంభించనున్నారు. గత మ్యాచ్‌లో లానే శుభారంభాన్ని అందిస్తారేమో చూడాల్సిందే. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. మొదటి వన్డేలో అంతగా ఆకట్టుకోలేకపోయిన సంజూ సాంసన్, శార్ధూల్ ఠాకూర్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది. వారి స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్‌కు తుది పదకొండులో చోటుకల్పించింది.