Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఈ ఏడాదిలో మహేష్ బాబు తన తల్లిదండ్రులతో పాటు అన్నయ్యను కూడా కోల్పోవడంతో బాబు ఎంతో మనోవేదనకు గురయ్యారు. తండ్రి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇటీవల మహేష్ పెట్టిన పోస్ట్ కూడా అందరి హృదయాల్ని కదిలించింది. ఈ తరుణంలో ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో రెండు చోట్ల భారీగా ఏర్పాట్లు చేశారు. కృష్ణ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఎన్ కన్వెన్షన్ లో భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్ కన్వెన్షన్ దగ్గర కార్యక్రమం జరిగే చోట కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణ 27 సంవత్సరాలు వయసులో ఎలా ఉన్నారో అచ్చం అలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. అలాగే కృష్ణ మహేష్ అభిమానులకు జే ఆర్ సి కన్వెన్షన్ లో భోజన ఏర్పాట్లు చేశారు. మహేష్ ముఖ్యంగా అభిమానుల కోసం 5 వేల పాస్ లు పంపిణీ చేసి భోజనాలు పెడుతున్నారు. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.