Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బస్సుల్లో మెట్రో కాంబి టికెట్ ధరను ఆర్టీసీ సగానికి తగ్గించింది. రూ.20గా ఉన్న స్టూడెంట్ మెట్రో కాంబి టికెట్‌ను రూ.10కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల పాస్‌లను ఆర్డినరీ బస్సుల్లోనే అనుమతిస్తారు. ఒకవేళ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించాలంటే కాంబినేషన్ టికెట్ తీసుకోవాలి. గతంలో పది రూపాయలుగా ఉన్నప్పుడు ఎక్కువ మంది వినియోగించుకునేవారు. రూ.20కి పెంచిన తర్వాత విద్యార్థులకు భారంగా మారింది. కాంబి ధర తగ్గించాలని ఎంతోకాలంగా కోరుతున్నారు. పరిశీలించిన అధికారులు రూ.10 తగ్గిస్తూ తక్షణం అమల్లోకి తీసుకొచ్చారు.