Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజాబ్‌లోని కిరత్‌పూర్ సాహిబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సట్లేజ్ నదిపై ఉన్న లొహంద్ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు.. చెట్లకు ఉన్న పండ్ల తెంపుకున్నారు. అనంతరం రైల్వే పట్టాలపై కూర్చుకుని వాటిని తింటున్నారు. అయితే అదే సమయంలో సహరాన్‌పూర్ నుంచి హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండానే ఆ చిన్నారు తాము తెచ్చుకున్న పండ్లను తింటూ ఉండిపోయారు. దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడని పోలీసులు తెలిపారు. మరో చిన్నారి చికిత్స పొందుతున్నదని వెల్లడించారు.