Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్య నటుడు అలీ పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ సెటబ్రిటీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు, నాగార్జున-అమల దంపతులు, ఏపీ మంత్రి రోజా తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే అలీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదవిని కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు.