Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తమది రైతులకు అండగా నిలబడే ప్రభుత్వమని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాష్ట్రంలో 62 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందన్నారు. వ్యవసాయ రంగంలో తాము కొత్త ఒరవడిని తీసుకొచ్చామని తెలిపారు. రబీ 2020-21 సీజన్ లో అర్హత పొందిన 2.54 లక్షల మందికి రూ. 45.22 కోట్లు, ఖరీఫ్ 2021 సీజన్ లో అర్హత పొందిన 5.68 లక్షల మందికి రూ. 115.33 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వారి ఖాతాల్లోకి జమ చేశారు. దీంతోపాటు గోదావరి వరదలు, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న 45,998 మంది రైతులకు రూ. 39.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని అందించారు. వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు రైతులను మోసం చేశారని జగన్ మండిపడ్డారు. రుణమాఫీకి చంద్రబాబు కేవలం రూ.15 వేల కోట్లను మాత్రమే ఇచ్చారని, వైసీపీ ప్రభుత్వం రూ.25,971 కోట్లను ఇచ్చిందని చెప్పారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోగలిగితేనే రాష్ట్రం బాగుంటుందని, వైసీపీ ప్రభుత్వం రైతులకు క్రమం తప్పకుండా పరిహారం చెల్లిస్తోందని, ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారాన్ని అందిస్తున్నారు.