Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్: జమ్మూ-శ్రీనగర్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు లోయలో పడి అందులో ప్రయాణిస్తున్న ఒక ఇమామ్, ఆయు కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మృతి చెందారు. ఉదంపూర్ జిల్లా చెనాని ప్రాంతంలోని ప్రేమ్ మందిర్ సమీపంలో సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రాంబాన్ జిల్లాలోని గూల్-సంగల్‌దాన్ గ్రామం నుంచి జమ్మూకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. కారు అదుపుతప్పి 700 అడుగుల లోయలోకి జారిపడిందన్నారు. ఈ ప్రమాదంలో జామియా మసీదు ఇమామ్ ముఫ్తి అబ్దుల్ హమీద్ (32), ఆయన తండ్రి ముఫ్తి జమాల్ దిన్ (65) అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన ఆయన తల్లి హజ్రా బేగం (60), మేనల్లుడు అదిల్ గుల్జార్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ తీవ్ర గాయాలతో కన్నుమూశారని అన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్గం కోసం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.