Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరత్: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్వహించిన రోడ్ షోలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ రాయి ఆయన వైపు దూసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత ఆప్ అభ్యర్థి అల్పేష్ కత్రియా మాట్లాడుతూ ఆ రాయిని బీజేపీ గూండాలే విసిరారని ఆరోపించారు. ప్రజలు కేజ్రీవాల్‌కు పుష్పాలు చూపిస్తూ ఆహ్వానిస్తుంటే, బీజేపీ గూండాలు రాళ్లు విసిరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.