Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నవంబర్ గతంలో రెండు భూకంపాలు సంభవించిన తరుణంలో మళ్ళి మంగళవారం రాత్రి దేశ రాజధానిలో స్వల్ప భూకంపం సంభవించింది. న్యూఢిల్లీకి పశ్చిమాన సంభవించిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదయ్యాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం యొక్క లోతు భూమి నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో ఉంది.నవంబర్ 9వతేదీన నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం ఢిల్లీలోనూ చూపించింది. నవంబర్ 12వతేదీన నేపాల్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత కూడా ఢిల్లీలోనూ బలమైన ప్రకంపనలు సంభవించాయి.కేవలం 20 రోజుల్లో 3వసారి ఢిల్లీలో 2.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.