Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదారాబాద్: భారతీయ నౌకాదళ దినోత్సవం సందర్భంగా డిసెంబరు 4న విశాఖ సాగరతీరాన విన్యాసాలు జరుగుతాయని ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వర్గాలు తెలిపాయి. ఈ తరుణంలో నగర వాసులు వీక్షించేందుకు ఈనెల 30 నుండి డిసెంబరు 4వ తేదీన ఆర్కేబీచ్‌లో సన్నాహక విన్యాసాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. 1971లో కరాచీ హార్బర్‌లో భారత నౌకలపై జరిగిన దాడి ఘటనలో ఎందరో సైనికులు చేసిన త్యాగాలు మరువలేనివని ఈఎన్‌సీ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ బిశ్వజిత్‌దాస్ గుప్తా గుర్తు చేశారు. ఆ రోజున బీచ్‌రోడ్డులో విజయ స్మారక స్తూపం (విక్టరీ ఎట్ సీ) వద్ద అమరవీరులకు అతిథులు నివాళులు అర్పిస్తారన్నారు. దేశ త్రివిధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు గవర్నరు, కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరవుతారని మంగళవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలుస్తుంది. నౌకాదళ దినోత్సవం రోజున మెరైన్ కమెండోలు, వివిధ కమాండ్‌ల నుంచి 15 యుద్ధనౌకలు, 25 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, వాయిద్య సంగీతం, బృందగానం, దేశభక్తి గీతాలాపన, సైనిక వందన స్వీకరణ వంటి కార్యక్రమాలు ఉంటాయి.