Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జనగామ: ఇంటి ఆస్థి మార్పిడి విషయంలో గ్రామస్థుడి నుంచి లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్ రూ. 4500 తీసుకుంటుండగా ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో దాడులు చేసి పట్టుకున్నారు. గ్రామానికి చెందిన పేర్ని మల్లేశ్ అనే వ్యక్తి ఇంటి మ్యుటేషన్ విషయంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్ ను సంప్రదించాడు. అతడు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి డబ్బులు తీసుకుంటుండగా బుధవారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అతనితోపాటు ఇదే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది నగేశ్‌ను కూడా అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.